న్యూజిలాండ్ లో 100 రోజుల తరువాత మళ్లీ వచ్చిన కరోనా

న్యూజిలాండ్ లో 100 రోజుల తరువాత మళ్లీ వచ్చిన కరోనా

తమ దేశం విడిచి కరోనా మహమ్మారి వెళ్లిపోయిందని న్యూజీలాండ్ వాసులు ఎంతో సంతోషించారు. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ కోవిడ్ కేసులు లేవని ప్రకటించిన దాదాపు 100 రోజుల తరువాత ఒకే కుటుంబం నుంచి నలుగురు వ్యక్తులకు కరోనా సోకినట్లు తెలిసి దేశ ప్రధాని ప్ర‌ధాని జెసిండా ఆర్డెన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఆ కుటుంబంలోని వారికి వైరస్ ఎలా సోకిందనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. దీంతో దేశంలోని అతిపెద్ద నగరం ఆక్లాండ్ లో స్టే-ఎట్-హోమ్ అని ఆర్డర్ జారీ చేసింది. 22 మిలియన్ల జనాభా ఉన్నన్యూజిలాండ్ లో కరోనా సోకి 22 మంది మరణించారు. మే 1 నుండి కరోనా కేసులు నమోదు కాలేదు. తత్ఫలితంగా న్యూజిలాండ్ వాసులు సాంఘిక దూరం లేకుండా సాధారణ జీవనశైలిని గడుపుతున్నారు. అయితే క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి వాటికి ఇంకా అనుమతి లభించలేదు. ఆక్లాండ్ బుధవారం నుండి కనీసం మూడు రోజులు లాక్ డౌన్ విధించబడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story