మహిళా కానిస్టేబుల్‌తో రవీంద్ర జడేజా వాగ్వాదం

మహిళా కానిస్టేబుల్‌తో రవీంద్ర జడేజా వాగ్వాదం

టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా ఓ మహిళా కానిస్టేబుల్ కు మధ్య వాగ్వివాదం నెలకొంది. ఈ విషయాన్నీ మంగళవారం గుజరాత్‌ పోలీసులు తెలిపారు. జడేజా తన భార్య రివిబాతో కలిసి సోమవారం రాత్రి 9. గంటల సమయంలో కారులో వెళ్తుండగా వీరి వాహనాన్ని తనిఖీ చేసేందుకు మహిళా కానిస్టేబుల్‌ సోనాల్‌ గోసాయ్‌ నిలిపివేశారు. డ్రైవర్‌ సీట్‌లో ఉన్న జడేజా మాస్క్‌ ధరించి ఉన్నాడు.

అయితే జడేజా భార్య మాత్రం మాస్క్‌ ధరించలేదు.. దీంతో జడేజా భార్యను మాస్క్ ఎందుకు‌ ధరించలేదని ప్రశ్నించడంతోపాటు జరిమానా కట్టాలని మహిళా పోలీస్‌ చెప్పింది. దీంతో రవీంద్ర జడేజాకు కానిస్టేబుల్‌కు మధ్య వాదన జరిగింది, మరోవైపు రివిబా కూడా మహిళా పోలీస్ పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు డీసీపీ మనోహర్‌ సింగ్‌ తెలిపారు.

Tags

Next Story