సంజయ్ దత్ కు క్యాన్సర్‌.. స్టేజ్ ఫోర్ దశలో..

సంజయ్ దత్ కు క్యాన్సర్‌.. స్టేజ్ ఫోర్ దశలో..

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ స్టేజ్ ఫోర్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు లీలావతి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో శనివారం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆయనను సోమవారం డిశ్చార్జ్ చేశారు. సంజయ్ ఆస్పత్రిలో చేరినప్పుడు ఆక్సిజన్ స్థాయి 90-92% మధ్య ఉంది. అత్యవసర చికిత్సలో భాగంగా యాంటిజెన్ కిట్ ద్వారా కోవిడ్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష ఫలితం వైరస్ ఉనికిని చూపించలేదు. తరువాతి పరీక్షల్లో అతడి ఛాతీలో నీరు చేరుతున్నట్లు తెలిసింది.

దానిని బట్టి సంజయ్ నాలుగవ దశ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు నిర్ధారించాయి. తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడు డాక్టర్ జలీల్ పార్కర్‌ను జాతీయ మీడియా సంప్రదించగా, సంజయ్ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి సుముఖంగా లేరు. మంగళవారం, సంజయ్ వైద్య చికిత్స కోసం చిన్న విరామం తీసుకుంటున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు. "హాయ్ ఫ్రెండ్స్.. నా కుటుంబం మరియు స్నేహితులు నాతో ఉన్నారు. చింతించకండి లేదా అనవసరంగా ఊహాగానాలు చేయవద్దని నా శ్రేయోభిలాషులను కోరుతున్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలతో నేను త్వరలోనే కోలుకుంటాను అని ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story