పెయింటింగ్ ని చూసి భయపడిన సుశాంత్: ఈడి ఎదుట రియా

పెయింటింగ్ ని చూసి భయపడిన సుశాంత్: ఈడి ఎదుట రియా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గతేడాది అక్టోబర్‌లో ప్రియురాలు రియా చక్రవర్తితో కలిసి ఇటలీ వెళ్లారు. ఈ యాత్రలో చూసిన ఓ పెయింటింగ్ అతడి హృదయాన్ని కలవరపాటుకు గురిచేసింది. తమ ఇటలీ పర్యటనలో సుశాంత్‌ను కదిలించిన పెయింటింగ్ ఇది అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు రియా తెలిపింది. సాటర్న్ తన సొంత బిడ్డను తినేస్తోంది. సుశాంత్ ఆ పెయింటింగ్ ని చూసి ఒక్కసారిగా ఉద్విగ్నతకు లోనయ్యాడు.

సుశాంత్, రియా అక్టోబర్ 2019 లో ఇటలీ వెళ్లినప్పుడు అక్కడ 600 సంవత్సరాల పురాతన హెరిటేజ్ హోటల్‌లో బస చేశారు. రియా గత సంవత్సరం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాము బస చేసిన హోటల్ నుండి కొన్ని వీడియోలు మరియు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ హెరిటేజ్ హోటల్ లోని గోడలపై అనేక పాత చిత్రాలు ఉన్నాయి. చర్చిలో ఉన్న ఓ పెయింటింగ్ స్పానిష్ కళాకారుడు ఫ్రాన్సిస్కో గోయా వేసిన 'సాటర్న్ డివౌరింగ్ హిస్ ఓన్ సన్'. (సాటర్న్ తన సొంత కుమారుడిని మ్రింగివేస్తున్నాడు). పెయింటింగ్ వెనుక ఉన్న కథ.. టైటాన్ క్రోనస్ యొక్క గ్రీకు పురాణం ప్రకారం సాటర్న్ తన పిల్లలలో ఒకరు తనను పడగొడతారని క్రోనస్ భయపడ్డాడు. ఈ భయం అతని పుట్టిన తరువాత తన పిల్లవాడిని తినడానికి దారితీసింది.

ఫ్రాన్సిస్కో గోయా వేసిన ఈ పెయింటింగ్ అతను వేసిన 14 బ్లాక్ పెయింటింగ్స్‌లో ఒకటి. స్పెయిన్లోని మాడ్రిడ్ సమీపంలో ఉన్న తన ఇంటి గోడలపై గోయ వీటిని చిత్రించాడు. ఈ ఇల్లు మధ్య స్పెయిన్‌లోని మంజనారెస్ నది ఒడ్డున ఉంది. 1819 నుండి 1823 వరకు గోయా ఇక్కడ నాలుగు సంవత్సరాలు నివసించారు. ఈ నాలుగు సంవత్సరాలలో అతను తన ఇంటి గోడపై తన 14 బ్లాక్ పెయింటింగ్స్‌ను చిత్రించాడు. ఈ చిత్రాలలో ఒకటి సాటర్న్ తన సొంత కుమారుడిని మ్రింగివేయుట. గోయ వేసిన చిత్రాలను బట్టి ఆ సమయంలో స్పెయిన్లో ఏమి జరుగుతుందో అతడు వేసిన చిత్రాల ద్వారా ప్రతిబింబిస్తుంది.

ఆ చిత్రంలోని దృశ్యాన్ని చూసిన తరువాత సున్నిత మనసకుడైన సుశాంత్ తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఈ సంఘటన తర్వాత తాను సుశాంత్‌ను ఓదార్చడానికి ప్రయత్నించానని రియా వివరించింది. అది జరిగిన తరువాత సుశాంత్ లోపల ఏదో జరుగుతోంది అనే విషయం స్పష్టమైంది అని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story