పుతిన్ గ్రేట్.. కూతురిపైన వ్యాక్సిన్ ప్రయోగం.. : సోమిరెడ్డి

పుతిన్ గ్రేట్.. కూతురిపైన వ్యాక్సిన్ ప్రయోగం.. : సోమిరెడ్డి

రష్యా అధ్యక్షుడు గ్రేట్.. వ్యాక్సిన్ ను కూతురిపైనే ప్రయోగించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ ప్రజలను కరోనా బారి నుంచి రక్షించాలని తమ దేశం రూపొందించిన వ్యాక్సిన్ సురక్షితమైందని భరోసాని దేశ ప్రజలకు కల్పించారు. వ్యాక్సిన్ తుది ట్రయల్స్ లో భాగంగా తన కూతురిపైన ప్రయోగించారు. రష్యా అధ్యక్షుడి ఆశ, ఆశయం ఫలించి వ్యాక్సిన్ తుది ట్రయల్స్ సక్సెస్ అయ్యింది. ఇందుకు గాను అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఆయన అంకితభావం చిరస్మరణీయమని మంత్రి కొనియాడారు. కన్న బిడ్డ కన్నా దేశ ప్రజల క్షేమమే ముఖ్యమని భావించి పుతిన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని సోమిరెడ్డి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story