కరోనాతో ప్రముఖ ఉర్దూ కవి కన్నుమూత

కరోనాతో ప్రముఖ ఉర్దూ కవి కన్నుమూత

ప్రముఖ ఉర్దూ కవి రహత్ ఇందోరి మంగళవారం మధ్యప్రదేశ్ లోని అరబిందో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు రెండు సార్లు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వివరించారు. ఇందోరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే ఆయనకు 60 శాతం నిమోనియా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. 70 ఏండ్ల ఇందోరి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేవారు. కవిగా, పెయింటర్ గా, బాలీవుడ్ పాటల రచయిత ఇలా విభిన్న రంగాల్లో ప్రావిణ్యం ఉన్న ఇందోరి మరణం బాలీవుడ్ ప్రముఖులను కలచివేసింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరినప్పుడు ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తాను త్వరగా కోలుకునేందుకు దేవుడిని ప్రార్థించమని అభిమానులను కోరారు. అయిత తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, ఫోన్ల ద్వారా వాకబు చేయవద్దని సోషల్ మీడియా ద్వారా తానే వెల్లడిస్తానని తెలిపారు. కాగా ఇందోరి మరణం పట్ల మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నేత రాహుల గాంధీతో పాటు పలువురు సంతాపం ప్రకటించారు.

Tags

Next Story