వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సూర్యనారాయణరాజు

X
ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలోని ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ఆగస్ట్ 13 చివరి తేదీ కాగా, 24న పోలింగ్ జరగనుంది. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు కుమారుడు డా.పెన్మత్స సూర్యనారాయణరాజు పేరును ఖరారు చేశారు వైకాపా అధినేత వైఎస్ జగన్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
