కోజికోడ్ విమాన ప్రమాదంలో 85 మంది కోలుకున్నారు: ఎయిర్ ఇండియా

కోజికోడ్ విమాన ప్రమాదంలో 85 మంది కోలుకున్నారు: ఎయిర్ ఇండియా

కోజికోడ్ విమాన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో 85 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఇప్పటివరకూ 85 మంది కోలుకున్నారని.. మిగిలిన వారి సమాచారం త్వరలోనే తెలుపుతామని అన్నారు. కాగా.. ఈ నెల 7న కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఓ విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ విమానంలో 190 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో పైలెట్, కో పైలట్ సహా పలువురు మరణించారు. చాలా మంది గాయాలపాలైయ్యారు. దీంతో గాయాలపాలైనవారిని పలు ఆస్పత్రులకు తరలించారు. దీంతో ఇందులో 85 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ కింద ప్రమాద ఘటనపై దర్యాప్తునకు p-ఆదేశించామని, బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవల తెలిపారు. దర్యాప్తులో వెల్లడైన విషయాలు త్వరలోనే తెలయజేస్తామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story