తక్కువ ధరలో కరోనా ఔషధం
మహమ్మారి కరోనా పేద, ధనిక తేడాలేకుండా అందరికీ వస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ కాడిలా లిమిటెడ్ అతి తక్కువ ధరకు ఔషధాన్ని మార్కెట్ చేస్తోంది. గిలియడ్ సైన్సెస్ యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ జెనరిక్ వెర్షన్ ను గురువారం విడుదల చేసింది. 100 ఎంజీ ఇంజక్షన్ ధరను సుమారు రూ.2,800 గా ధర నిర్ణయించింది. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు రెమ్ డాక్ బ్రాండ్ పేరుతో దీన్ని విక్రయించనున్నామని రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ తెలిపింది. యాంటీవైరల్ డ్రగ్ రెమ్ డెసివిర్ జెనరిక్ వెర్షన్ ను భారతదేశంలో విడుదల చేసిన ఐదవ సంస్థగా జైడస్ నిలిచింది. కాగా దేశంలో వైరస్ బారిన పడిన మొత్తం కేసుల సంఖ్య 2.33 మిలియన్లు దాటగా, మరణించిన వారి సంఖ్య 46,091 గా ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com