బాపు బొమ్మకు పెళ్లి.. పందిట్లోకి పల్లకిలో..

బాపు బొమ్మకు పెళ్లి.. పందిట్లోకి పల్లకిలో..

మెగా డాటర్ నిహారిక పెళ్లి కూతురిగా ముస్తాబైంది.. వరుడెవరో తెలిసిపోయింది. మూడుముళ్లు పడడమే ఆలస్యం.. ముచ్చటగా కనువిందు చేయనుంది ఈ జంట. త్వరలో నిశ్చితార్ధం జరుపుకోనున్న నిహరిక అప్పుడే పెళ్లి కూతురి గెటప్ లో ఎలా ఉంటానోనని ట్రయల్స్ వేస్తోందా ఏంటి అని ఆరా తీస్తే.. తండ్రి నాగబాబు హోస్ట్ గా వ్యవహరించనున్న ఓ టీవీ కార్యక్రమం కోసం తనయ నిహా పెళ్లి కూతురి గెటప్ లోకి మారింది. మరి కొద్ది రోజుల్లో రాబోతున్న వినాయకచవితి సందర్భంగా ఓ ఛానెల్ 'బాపు బొమ్మకు పెళ్లి' అనే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తోంది. పండుగ రోజు ప్రసారమయ్యే ఈ ప్రత్యేక కార్యక్రమంలో నిహా పెళ్లి విశేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story