అమర్‌నాథ్ యాత్ర రద్దైనా భక్తులకు వైష్ణోదేవి ఆలయ దర్శనం

అమర్‌నాథ్ యాత్ర రద్దైనా భక్తులకు వైష్ణోదేవి ఆలయ దర్శనం

అమర్‌నాథ్ యాత్రకు భద్రత ఒక ప్రధాన సమస్య అయితే.. ప్రస్తుతం కరోనా మహమ్మారి అంతకంటే పెద్ద సమస్యగా తయారైంది. దీంతో భక్తులను యాత్రకు అనుమతించలేదు.. ఇకపోతే అదే రాష్ట్రంలో ఉన్న వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించడానికి భక్తులను అనుమతిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అనేక కారణాలున్నాయి. అమర్‌నాథ్ పవిత్ర గుహ కశ్మీర్ లోయలో ఉంది. వైష్ణోదేవి ఆలయం జమ్ముకశ్మీర్ లో ఉంది. కశ్మీర్ లోయలో కంటే జమ్ము డివిజన్లో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి మరోవైపు కశ్మీర్ లోయలో భద్రత కూడా ప్రధాన సమస్య. రహదారి సౌకర్యవంతంగా లేకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. వైష్ణోదేవి ఆలయ దర్శనానికి ప్రతి రోజు గరిష్టంగా 500 మంది భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ప్రతి భక్తుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతే ఆలయం లోపలికి ప్రవేశం లభిస్తుంది.

Tags

Next Story