కరోనా కిల్లర్.. కమింగ్ సూన్

కరోనా కిల్లర్.. కమింగ్ సూన్

ప్రతి ఏటా పరిస్థితులకు అనుగుణంగా కళాకారుల చేతిలో గణేష్ ప్రతిమ రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కాన్సెప్ట్ ని తీసుకుని గణేష్ విగ్రహాలు తయారవుతున్నాయి. సూరత్ కు చెందిన వ్యక్తి కరోనా కిల్లర్ గణేశుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ ఏడాది పండుగలన్నింటినీ కరోనా మహమ్మారి మింగేసింది. గణేశ చతుర్థి పండుగను ప్రతిసారీ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వారు సైతం వైరస్ కు భయపడాల్సి వస్తుంది.

గణేశుడి విగ్రహ తయారీదారులు కూడా కరోనా కిల్లర్, కరోనా వారియర్ వంటి ఇతివృత్తంతో ఈ సారి విగ్రహాలు తయారు చేస్తున్నారు. అంటువ్యాధిని అంతంచేయడానికి గణేశుడు సిద్ధమవుతున్నాడు. సూరత్‌కు చెందిన ఆశిష్ పటేల్ కరోనా కిల్లర్ గణేశ్ విగ్రహాన్ని నిర్మించారు. ఆశిష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విగ్రహం ద్వారా సమాజానికి సందేశం ఇవ్వడానికి ప్రయత్నించాను. వైరస్ ను అంతం చేయడానికి నివారణ చర్యలు తీసుకోవాలన్న సందేశాన్ని ఇవ్వడానికి కరోనా కిల్లర్ గణేశాను ఈసారి సిద్ధం చేస్తున్నామని ఆశిష్ తెలిపారు.

బెంగళూరుకు చెందిన మరో కళాకారుడు గణేశుడిని హెల్త్ గార్డ్ గా మార్చాడు. గణేష్‌ను డాక్టర్ విగ్రహంగా, అతని వాహనాన్ని నర్సుగా చేశారు. అలాగే కోయంబత్తూరుకు చెందిన కళాకారుడు కరోనా వారియర్‌గా చేశాడు. స్వయంగా గణేషుడే వచ్చి రంగంలోకి దిగి కరోనాను అంతం చేస్తే తప్ప మహమ్మారి మనమధ్య నుంచి వెళ్లదనే సందేశాన్ని వివరిస్తూ కళాకారులు గణేశుడి విగ్రహాలు తయారు చేస్తున్నారు.

Tags

Next Story