39 మంది చిన్నారుల కోసం సోనూ ఓ స్పెషల్ ఫ్లైట్..

39 మంది చిన్నారుల కోసం సోనూ ఓ స్పెషల్ ఫ్లైట్..

కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కోసం ఫిలిప్పీన్స్ నుండి న్యూ ఢిల్లీకి 39 మంది పిల్లల ప్రయాణానికి ఏర్పాట్లు చేయనున్నట్లు సోను సూద్ గురువారం ప్రకటించారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఫిలిఫ్పైన్స్ చిన్నారులు.. ఢిల్లీలో శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఢిల్లీకి రాలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న సోనూసూద్ ఆ 39 మంది చిన్నారులు ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు. "చిన్నారుల విలువైన ప్రాణాలను కాపాడుకుందాం. రాబోయే రెండు రోజుల్లో వారిని భారతదేశానికి తీసుకువస్తాము అని సోనూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags

Next Story