విద్యార్థులకు చివరి ఏడాది పరీక్షలు కీలకం: యూజీసీ

విద్యార్థులకు చివరి ఏడాది పరీక్షలు కీలకం: యూజీసీ

యూజీ, పీజీ విద్యార్థులకు చివరి ఏడాది పరీక్షలు చాలా కీలమని యూజీసీ సుప్రీకోర్టుకు తెలిపింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులందరికీ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. కానీ, చివరి ఏడాది పరీక్షలు మాత్రం నిర్వహించాలని యూజీసీ.. యూనివర్శిటీలను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, పలు రాష్ట్రప్రభుత్వాలు, విద్యార్థి సంఘాలు ఈ పరీక్షలను కూడా రద్దు చేయాలని కోరుతూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో చివరి ఏడాది విద్యార్థులకు పరీక్షలు చాలా కీలకమని యూజీసీ సుప్రీం కోర్టు ముందు తెలిపింది. చివరి సంవత్సరం పరీక్షలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని తాము జారీ చేసిన ఉత్తర్వులను అన్ని రాష్ట్రప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిందేనని మరోసారి తెలిపింది. విద్యారంగ నిపుణుల సూచనల మేరకే ఈ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story