కరోనాకి కషాయాలు.. వద్దంటున్న వైద్యులు

కరోనాకి కషాయాలు.. వద్దంటున్న వైద్యులు

కరోనాకి కషాయాలు తాగేస్తున్నారా.. ఆపండి అతిగా తాగకండి అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రధాని మోదీ చెప్పిన కథా పానీయం మొదలు.. రోజూ ఏదో ఒక కొత్త రకం కషాయం యూట్యూబుల్లోనో, వాట్సప్ ల్లోనూ దర్శనమిస్తోంది.. కషాయం వల్ల కరోనా తగ్గుతుందని ఏ డాక్టరైనా మీకు చెప్పారా అని అడుగుతున్నారు వైద్యులు. మంచిది కదా అని అతిగా, అదే పనిగా రోజుకి మూడు, నాలుగు సార్లు మసాల దినుసులు వేసిన కషాయం తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ఇక నిమ్మరసం మోతాదు మించితే కూడా పంటి మీద ఉన్న ఎనామిల్ పోతుందంటున్నారు. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న ఈ కషాయంతో రోగనిరోధకశక్తి పెరగవచ్చేమో కానీ కరోనా మాత్రం తగ్గదంటున్నారు. కొవిడ్ చికిత్సకు అల్లోపతిలో కూడా సరైన ఔషధాలు లేకే ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది.

రోగనిరోధక శక్తిని పెంచే కషాయం గురించి ముంబైలోని ఆయుర్వేద ఆర్‌ఐ పోదర్ కాలేజీ డీన్ డాక్టర్ గోవింద్ ఖాతి మాట్లాడుతూ... "ఆయుష్ మంత్రిత్వ శాఖ రక్షణ కోసం మరియు రోగనిరోధక శక్తి ప్రయోజనాలను బలోపేతం చేయడానికి వివిధ పానీయాలను సిఫారసు చేసింది . ఈ పదార్ధాలన్నీ సాధారణ జలుబు, దగ్గు మరియు జ్వరాలకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అవి ఒత్తిడిని తగ్గించడంలో మాత్రమే సహాయపడతాయి అని డాక్టర్ ఖాతి వివరించారు. ఈ మిశ్రమాన్ని తీసుకున్న తర్వాత వారు కొవిడ్ తో బాధపడుతున్నారని లేదా నిర్ధారణ కాలేదని చెప్పిన రోగులను చూడలేదని డాక్టర్ ఖాతి నొక్కిచెప్పారు.

పసుపులో యాంటీ-వైరల్ లక్షణాలు ఉన్నాయని చెబుతారు కానీ దాన్ని శాస్త్రీయంగా వివరించలేదు. ఇదే తరహాలో, అల్లం ఇతర సహజ సమ్మేళనాలతో ఉపయోగించినప్పుడు ఇన్ ప్లూయెంజా వైరస్ బారిన పడకుండా ఆపుతుంది. ఇక లవంగాలు వైరస్ కు వ్యతిరేకంగా యాంటీ-వైరల్ లక్షణాలను ప్రదర్శిస్తాయి. విటమిన్ సి యొక్క మూలాలు అయిన నిమ్మకాయలు కూడా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయని నివేదించబడ్డాయి.

కషాయం మంచిది కదా అని అతిగా తీసుకోవడం వలన గుండె సమస్యలు తలెత్తి అది కొవిడ్ అనే అనుమానంతో ఆస్పత్రులకు వస్తున్న రోగుల సంఖ్య ఎక్కువవుతోందని వైద్యులు వివరిస్తున్నారు. మరికొందరు వేడిగా ఉన్న కషాయం తాగడం వల్ల గొంతులో పుండ్లు పడుతున్నాయని తెలిపారు. అందుకే సొంత వైద్యం కొంత మానుకుని డాక్టర్ సలహా మేరకు చేయమంటున్నారు.

ఇక వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సిన ట్యాబ్లెట్లు హైడ్రాక్సీ క్లోరోక్విన్ సల్ఫేట్ వంటి మందులను ఎవరికి తోచిన విధంగా వారు మింగేస్తున్నారు. ఫలితంగ గుండె లయ తప్పుతోంది. కరోనా దరి చేరకుండా ఉండడానికి ప్రస్తుతం మన చేతుల్లో ఉన్న సురక్షిత ఆయుధాలు, మాస్కు, శానిటైజర్, శుభ్రత పాటించడం, సామాజిక దూరాన్ని వీలైనంత మేరకు పాటిస్తూ.. రోజుకు రెండు మూడు సార్లు ఆవిరి పట్టుకుంటే ప్రయోజనం ఉంటుందని ప్రముఖ వైద్యులు వివరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story