ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్: మోదీ

ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్: మోదీ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా ప్రసంగించారు. ప్రపంచం కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తోందని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారని మోదీ తన ప్రసంగంలో టీకాల ప్రస్తావన తీసుకువచ్చారు. భారతదేశంలో మూడు కోవిడ్ -19 వ్యాక్సిన్లు తయారవుతున్నాయని, ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మన నిపుణులు, శాస్త్రవేత్తలు వాటికి ఆమోదం తెలపగానే కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తుందని అన్నారు. అలాగే కరోనా వైరస్పై ముందుండి పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందిని, పోలీసులను, ఆరోగ్య కార్యకర్తలను ఆయన ప్రశంసించారు.

Tags

Read MoreRead Less
Next Story