బీజేపీలో చేరిన పెరియార్ మనవడు

బీజేపీలో చేరిన పెరియార్ మనవడు

తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పెరియార్ మనవడు సతీశ్ కృష్ణ కమలం గూటికి చేరారు. సామాజిక ఉద్యమనేత, ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరుగాంచిన పెరియార్‌ మనవడే కాషాయ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. పెరియార్‌ నేలపై బీజేపీ ఎప్పటికీ బలపడలేదని డీఎంకే వ్యాఖ్యలను చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్వయంగా పెరియార్ మనవడే బీజేపీలో చేరడం డీఎంకేకు గట్టి సవాల్ అని చెప్పాలి. ఇటీవల డీఎంకే ఎమ్మెల్యే కూకా సెల్వం ప్రధానిని ప్రశంసిస్తూ.. పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story