నాన్న ఆరోగ్యం బానే ఉంది.. త్వరలో ఇంటికి వచ్చేస్తారు: ఎస్పీ చరణ్

కరోనా బారిన పడి గత పది రోజులుగా చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం పరిస్థితి క్షీణించిందని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ఆయనకు వెంటిలేటర్ అమర్చారని, నిపుణులైన వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, త్వరలో కోలుకుని ఇంటికి వస్తారని బాలు కుమారుడు చరణ్ తెలిపారు. ఓ తమిళ టీవీ చానల్ లో తండ్రి ఆరోగ్యం గురించి వచ్చిన వార్త నిజం కాదన్నారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని ట్విట్టర్ ద్వారా అభిమానులను కోరారు.
ఇక ఎస్పీ బాలు చెల్లెలు వసంత కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం అన్నయ్యకు కొంచెం క్రిటికల్ గా ఉన్నమాట వాస్తవమేనని, ఆ తర్వాత స్టేబుల్ గా ఉన్నారని అన్నారు. ఎవరూ కంగారు పడొద్దు.. ఆయనకు విల్ పవర్ ఉంది.. భగవంతుని ఆశీస్సులు, మనందరి ప్రార్థనలతో తప్పకుండా ఆయన ఇంటికి వస్తారు.. మీ ప్రార్థనలు ఆయనకు శ్రీరామ రక్ష అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com