బడి ఇప్పుడే తెరుచుకోదు: ఢిల్లీ సీఎం

బడి ఇప్పుడే తెరుచుకోదు: ఢిల్లీ సీఎం

74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించారు. తన ప్రసంగంలో పాఠశాల తెరుచుకోవడంపై తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నవిషయాన్ని ప్రస్తావించారు. కోవిడ్ అదుపులోకి వచ్చాకే బడి తెరుచుకుంటుందని ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యం తమకెంతో ముఖ్యమని కేజ్రీ తెలిపారు. పాఠశాలలు ఇప్పుడే తెరవొద్దని రోజూ మెసేజ్ లు వస్తున్నాయి. వారికి నేను హామీ ఇస్తున్నా కోవిడ్ పూర్తిగా అదుపులోకి వచ్చింది అని నమ్మకం కలిగాకే పాఠశాలలు తెరుస్తాం అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజధానిలో కరోనా నియంత్రణలోనే ఉందని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story