ఫ్రెండ్స్ 2 సపోర్ట్.. ప్లాస్మా దాతలకోసం ఓ వెబ్‌సైట్‌

ఫ్రెండ్స్ 2 సపోర్ట్.. ప్లాస్మా దాతలకోసం ఓ వెబ్‌సైట్‌

కరోనా పేషెంట్లు కోలుకుని ప్లాస్మా దాతలుగా మారుతున్నారు. తాము జీవిస్తూ మరి కొన్ని జీవితాలకు బ్రతుకుపై ఆశ కల్పిస్తున్నారు. కొన్ని అనుమాలతో ప్లాస్మా థెరపీ మొదలైనా అది ఇప్పుడు కరోనా రోగుల పాలిట కల్పవృక్షంగా మారింది. కోలుకున్న పాజిటివ్ రోగులందరూ పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టేలా ప్రోత్సహిస్తోంది ఫ్రెండ్స్ 2 సపోర్ట్ . ప్రపంచంలోని కరోనా పాజిటివ్ పేషెంట్లందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేసేలా ఈ ‌సైట్‌ లో ఒక ప్రత్యేక సెక్షన్ ని ప్రారంభించారు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత, ఫ్రెండ్స్ 2 సపోర్ట్ ఫౌండర్ షేక్ షరీఫ్.

తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. పాజిటివ్ రోగులందరూ ఈ వెబ్‌సైట్‌ లో ప్లాస్మా దాతలుగా పేర్లు నమోదు చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన బ్లడ్ గ్రూపుల వారికి ప్లాస్మా దొరకడం చాలా కష్టమైన పని. ఈ ‌సైట్‌ లో కనుక పేరు నమోదు చేసుకుంటే పని సులభంగా మారే అవకాశాలు ఉంటాయి. మరింత మంది కోవిడ్ పేషెంట్లకు సహాయం చేసినవారవుతారు. షరీష్ 2005లోనే ఈ వెబ్‌సైట్‌ ప్రారంభించారు. దీనిలో ఉచితంగా రక్తదానం చేసే వారి వివరాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సైట్ ద్వారానే కోవిడ్ రోగులకు ప్లాస్మా డొనేషన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.

కోవిడ్ రోగులకు, బంధువులకు ప్లాస్మా దానం ఎవరు చేస్తారు, వారి వివరాలు ఎలా సేకరించాలి అనే దాని పట్ల అవగాహన ఉండదు. అటువంటి వారికి సహాయకారిగా ఉంటుంది ఈ వెబ్‌సైట్‌. గత వారం రోజులుగా ట్రయల్ రన్ నిర్వహించారు ఈ వెబ్‌సైట్‌ కార్యకర్తలు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. మరింత మందికి అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా వెబ్‌సైట్‌ ప్రయత్నాలు ప్రారంభించింది.

ప్రస్తుతం ఈ సైట్‌లో ఆరు దేశాల నుండి 5 లక్షల మంది సాధారణ రక్తదాతలు స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో ఎక్కువ మంది భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు. "మేము ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో ఒక పోస్టర్‌ను అటాచ్ చేస్తున్నాము, వీటిని జిల్లా అధికారులు కోవిడ్ హాస్పిటల్స్ మరియు కోవిడ్ కేర్ సెంటర్లలో ప్రదర్శిస్తారు. తద్వారా డిశ్చార్జ్ అవుతున్న వారు ప్లాస్మాను దానం చేయడానికి అర్హులవుతారు". అని ఫ్రెండ్స్ 2 సపోర్ట్ వెబ్‌సైట్ నిర్వాహకులు తెలిపారు. ప్లాస్మా దానం చేసేవారు ఆండ్రాయిడ్ ఆప్ ద్వారా కానీ, వెబ్‌సైట్ ద్వారా కాని తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ప్లాస్మా దాతలు మరిన్ని వివరాల కోసం https://www.friends2support.org/ చూడవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story