చొక్కాతో కరోనాకు చెక్.. వస్త్ర కంపెనీ సరికొత్త సృష్టి

చొక్కాతో కరోనాకు చెక్.. వస్త్ర కంపెనీ సరికొత్త సృష్టి

మాస్కులు, శానిటైజర్లు.. కరోనా రాకతో మార్కెట్లోకి వచ్చిన కొత్త ఉత్పత్తులు. వీటితో పాటు కరోనాను కట్టడి చేసే అనేక వస్తువులు రోజుకొకటి దర్శనమిస్తున్నాయి. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత దుస్తుల ఉత్పత్తి సంస్థ జొడాయిక్ కోవిడ్ వైరస్ తో పాటు మరికొన్ని బ్యాక్టీరియాలను చంపగలిగే కొత్త టెక్నాలజీతో ఒక చొక్కాను తయారు చేశారు. వైరోబ్లాక్ అనే బయోకెమికల్ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు. బట్టతయారీలోనే ఈ రసాయనాలు వాడతారు. ఈ షర్ట్ ధరించినప్పుడు ఎవరైనా తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్లు షర్ట్ మీద పడితే అందులో ఉన్న వైరస్ ని ఇది నిర్వీర్యం చేస్తుంది. వైరస్ వ్యాప్తి వేగాన్ని కూడా తగ్గిస్తుంది.

ముప్పయి ఉతుకుల వరకు చొక్కాకు ఆ శక్తి ఉంటుంది. అయిత ఇదేమీ కరోనా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.. ముందు జాగ్రత్త కోసం మాస్కులు ఎలా ధరిస్తున్నామో.. షర్ట్ లు కూడా అలానే ధరించాల్సి ఉంటుంది అని కంపెనీ ప్రకటించింది. స్విస్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వస్త్ర పరిశోధనలో ముందుంది. ఉష్ణోగ్రతను తగ్గించే చల్లటి దుస్తులను కూడా ఈ సంస్థ తయారు చేసింది. ఈ సంస్థ సహాయంతోనే జొడాయిక్ వైరస్ ని నియంత్రించే చొక్కాను తయారు చేసి మార్కెట్లో విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story