క్రికెట్ అభిమానులకు మరోషాక్.. ధోని బాటలో రైనా

క్రికెట్ అభిమానులకు మరోషాక్.. ధోని బాటలో రైనా

భారతీయ క్రికెట్ అభిమానులు షాక్‌కు మీద షాక్ తగులుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే, ధోని ఈ విషయం ప్రకటించి గంట కూడా అవ్వక ముందే సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్టు తెలిపారు. రైనా తనదైన శైలిలో ఆడుతూ వేలాది మంది అభిమానులను సంపాధించుకున్నారు. మ్యాచ్ ఓటమి దశలో ఉన్న సమయంలో చాలా సార్లు భారత్ కు విజయాలను అందించారు. రైనా వన్డేల్లో 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు చేశాడు. టీ-20లో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేశాడు. 2005లో రైనా శ్రీలంక జట్టుతో తొలి వన్డే ఆడాడు. ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story