జమ్మూకశ్మీర్‌లో 2జిల్లాల్లో 4జీ ముబైల్ సేవలు

జమ్మూకశ్మీర్‌లో 2జిల్లాల్లో 4జీ ముబైల్ సేవలు

జమ్మూకశ్మీర్‌లో రెండు జిల్లాల్లో 4జీ ముబైల్ సేవలను పునరుద్దరించారు. ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో ఈ సేవలు పునరుద్దరించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్‌లో 4జీ సేవలను పునరుద్ధరించడం ఇదే తొలిసారి. ముందుగా కశ్మీర్‌లోని గందర్‌బాల్‌, జమ్ములోని ఉధమ్‌పూర్‌లో 4జీ సేవలను తిరిగి ప్రారంభించామని అధికారులు తెలిపారు. ఈ సేవలు సెప్టెంబరు 8 వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే కేవలం పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రీపెయిడ్‌ కస్టమర్లు స్వీయ ధ్రువీకరణ సమర్పించిన తర్వాతనే వారికి 4జీ సేవలను అందుబాటులోకి వస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story