మనోహర్ పారికర్ తనయుడికి పాజిటివ్..

మనోహర్ పారికర్ తనయుడికి పాజిటివ్..

మాజీ రక్షణ మంత్రి, దివంగత బిజెపి నాయకుడు మనోహర్ పారికర్ పెద్ద కుమారుడు ఉత్పాల్ కు కరోనా వైరస్ సోకింది. "వైద్యుల సలహా మేరకు సరైన చికిత్స తీసుకోవటానికి, నేను ఆసుపత్రిలో చేరాను. నా ఆరోగ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ”అని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కూడా అయిన ఉత్పాల్ పారికర్ ట్వీట్ చేశారు. గత వారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో కేంద్ర రక్షణ మంత్రి ఆయుష్ శ్రీపాద్ నాయక్ కి పాజిటివ్ రాగా ఆయన కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. నాయక్ ఉత్తర గోవా సీటుకు చెందిన లోక్‌సభ ఎంపి.

Tags

Read MoreRead Less
Next Story