రోగులను చూసి ఎంతో నేర్చుకున్నా: కోవిడ్ బారిన పడ్డ డాక్టర్ హాన్సెల్
ఒక డాక్టరుగా మేము మాత్రమే కరోనాతో యుద్ధం చేయడం లేదు.. మా కుటుంబాలు కూడా చేస్తున్నాయి. ఇది అది అతిపెద్ద త్యాగం అని ఎంబిబిఎస్ గ్రాడ్యుయేట్ అయిన డాక్టర్ హాన్సెల్ మిస్కిట్టా అంటున్నారు. ఏప్రిల్‌లో కోవిడ్ విధులకోసం సైన్ప్ చేసిన మొదటి వాలంటీర్లలో ఒకరు. దక్షిణ మధ్య ముంబైలోని వర్లిలోని ఎన్‌ఎస్‌సిఐ స్టేడియంలో పిపిఇ కిట్ ధరించి, కోవిడ్ రోగులకు చికిత్స చేస్తూ, రెండున్నర నెలలపాటు సేవలందించిన డాక్టర్ హాన్సెల్.. "ఇది నా జీవితంలో తీసుకున్న ఓ మంచి నిర్ణయం" అని చెప్పారు.
కొవిడ్ రోగులకు సేవలందించిన రెండున్నర నెలల కాలం ఆమె ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా సురక్షితంగా ఉన్నారు. కాని ఇంటికి తిరిగి వచ్చిన కొన్ని వారాల తర్వాత వైరస్ బారిన పడ్డారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రిలో ఒక వారం, ఐసియులో మూడు రోజులు గడిపిన తరువాత, ఆమె గృహ నిర్బంధంలో ఉండి పూర్తిగా కోలుకున్నారు. డాక్టర్ హాన్సెల్ అక్టోబర్ లో సర్జికల్ రెసిడెన్సీ పరీక్షకు హాజరవుతున్నారు. కుటుంబంలో ఆమే మొదటి వైద్యురాలు.
డాక్టర్ గా, రోగిగా రెండు వైపుల నుండి కోవిడ్ ని చూశారు హాన్సెల్. కోవిడ్ నుంచి కోలుకున్నాక తిరిగి కరోనా పేషెంట్లకు సేవలందించేందుకు సిద్దమవుతున్నారు. "నా రోగులే నన్ను మంచి వైద్యురాలిని చేసారు" అని చెబుతారామె. వైద్యునిగా మీరు కోవిడ్ రోగులకు చికిత్స చేసారు మరియు మీరు కోవిడ్ సంక్రమించినప్పుడు మీరే రోగి అయ్యారు. రెండు వైపులా మీరు ఎలా వ్యవహరించారు అని ప్రశ్నించినప్పుడు.. నేను భావోద్వేగాల వర్ణపటాన్ని అనుభవించాను - నొప్పిని భరించాను.. కొవిడ్ రోగులను అంటరానివారిగా వ్యవహరించే తీరును చూశాను అని అన్నారు.
ఒక డాక్టర్ గా కోవిడ్ రోగులకు సేవలందిస్తున్నప్పుడు ఓ ఆత్మీయ స్పర్శ వారికి ఎంత ఉపశమనం అందిస్తుందో నాకు తెలుసు. కోవిడ్ రోగులు కుటుంబాలకు దూరంగా ఉంటారు. ఎవరూ వారి దగ్గరికి రావటానికి ఇష్టపడరు. ప్రతి రోగిని ప్రేమగా పలకరించడం ద్వారా వారికి మానసికంగా ఉత్సాహాన్ని అందించేదాన్ని అని చెప్పారు. నేను రెండున్నర నెలలు కోవిడ్ విధులు నిర్వర్తించిన తరువాత జూన్ నెలలో ఇంటికి తిరిగి వచ్చాను. జూలైలో ఇంటికి దగ్గరలోని ఓ వ్యక్తికి కోవిడ్ రావడంతో వెళ్లి ఓ వైద్యురాలిగా ట్రీట్మెంట్ ఇచ్చాను. ఆ సమయంలో నేను కోవిడ్ బారిన పడ్డాను. అదే సమయంలో మా నానమ్మ మరణం నన్ను కలిచి వేసింది. ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయింది. ఇవన్నీ నా ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి.
కోవిడ్ విధులు నిర్వహించే సమయంలో ఎక్కువ గంటలు పీపీఈ కిట్ ధరించడంతో ఊపిరితిత్తులపై ప్రభావం చూపడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. జనరల్ వార్డులో పడకలు అందుబాటులో లేనందున ఐసియులో ఉన్నాను. మా అమ్మ కూడా అదే రోజు వైరస్ బారిన పడింది. నా తల్లికి నా సేవలు అవసరమైతే నేను మంచం మీద ఉండకూడదనుకున్నాను. కానీ అమ్మ ఇంటి వద్దనే ఉండి కోలుకుంది. నేను కూడా కరోనా నుంచి కోలుకున్నాను. ఐసియులో ఉండటం అంత సులభం కాదు. నేను 75 ఏళ్ల మహిళతో కలిసి ఐసియు వార్డును పంచుకున్నాను. ఛాతీ ఫిజియోథెరపీ ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుందని నేను ఫిజియోథెరపిస్టుల నుండి నేర్చుకున్నాను. నేను ఆ వ్యాయామాలను నేర్చుకుని రోగులకు నేర్పడంతో వారు మరింత త్వరగా రికవర్ అయ్యేవారు.
నేను చాలా మంది రోగులకు చికిత్స చేస్తున్నాను, కాని నా స్వంత తల్లికి వైద్యం చేయలేకపోయాను. నేను ఆమెకు చాలా దగ్గరగా ఉన్నాను. ఆసుపత్రిలో ఉన్నందున అమ్మ కోసం ఏమీ చేయలేకపోయాను. ఈ ఆలోచనలు నన్ను బాధించాయి. నా సీనియర్ డాక్టర్ రైస్ అన్సారీ చాలా బిజీగా ఉన్నప్పటికీ నాతో క్రమం తప్పకుండా మాట్లాడుతుండేవారు. నాకు అత్యంత సపోర్ట్ ఇచ్చిన మరో వ్యక్తి నా కాబోయే భర్త డాక్టర్ మికైల్ మర్చంట్. అతని తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ నన్ను రోజూ ఆసుపత్రికి తీసుకువెళ్లేవారు. మా అమ్మని కూడా ఆయన చూసుకున్నారు. కోవిడ్ రోగుల గురించి ఓ పుస్తకం రాయాలనుకుంటున్నాను. ఒక్కో అధ్యాయం ఒక్కో పేషెంట్ కి అంకితమిస్తా. నా రోగులే నన్నొక మంచి వైద్యునిగా చేశారని నేను భావిస్తాను.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com