కీలక నేతను పార్టీ నుంచి బహిష్కరించిన జేడీయూ

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకణాలు త్వరగా మారిపోతున్నాయి. తాజాగా, ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న శ్యామ్ రాజక్‌ను జేడీయూ పార్టీ నుంచి తొలగించింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ తెలిపారు. ఈ నేపథ్యంలో శ్యామ్ రాజక్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు చెప్పారు. అటు, పార్టీ తనను బహిష్కరించడం పట్ల శ్యామ్ రాజక్ ఆగ్రహం వ్యాక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్జేడీలో చేరనున్నట్టు ప్రచారం జోరందుకుంది. గతంలో లాలూ ప్రసాద్‌కు కీలక అనుచరుడైన ఆయన 2009లో జేడీయూలో చేరారు. మళ్లీ సొంత గూటికి చేరుతారని సమాచారం

Tags

Next Story