ఆవిరితో వైరస్ అంతమవుతుందా.. వైద్యులేం చెబుతున్నారు..

ఆవిరితో వైరస్ అంతమవుతుందా.. వైద్యులేం చెబుతున్నారు..
X

వైద్యుల సూచన మేరకు మందులు రోజుకు మూడు సార్లు ఆవిరి పడితే కరోనా మహమ్మారి బారిన పడినా కోలుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా రోగులు ఈ విధానాన్నిఅనుసరించి త్వరగా కోలుకుంటున్నారని హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రి వైద్యులు తమ పరిశీలనలో వెల్లడైనట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా 20 వేల మంది కరోనా బాధితులు ఉంటే అందులో 15 వేల మంది ఇంటి వద్దనే వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా లక్షణాలున్న వారు సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను చూసి, స్నేహితులు సూచించిన సలహాలను అనుసరించి సొంత వైద్యం చేసుకుంటున్నారు. కషాయాలు తాగుతూ కరోనా నియంత్రణలోకి వస్తుందని భ్రమపడుతున్నారు. కానీ అప్పటికే ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది.

అడ్మిట్ అయిన వారికి తొలుత ఆక్సిజన్ ఆ తరువాత వెంటిలేటర్ పెట్టాల్సి వస్తోంది అని అన్నారు. లక్షణాలు కనిపించగానే వైద్యుల సలహాతో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితిని నివారించొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ, రోజుకు మూడు సార్లు 15 నిమిషాల పాటు ఆవిరి పడితే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం ద్వారా రక్తనాళాలు వ్యాకోచించి ఊపిరి అందుతుందని అన్నారు. ఆవిరి ద్వారా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బాధితులు మందులు వాడుతూ ఆవిరి పట్టాలని.. ఒక్క ఆవిరితోనే కరోనా అంతమవుతుందని అనుకోవడం పొరపాటని సూచిస్తున్నారు.

Tags

Next Story