ఎస్పీ ఎలా ఉన్నారు.. పీఎం కార్యాలయం ఆరా

ఎస్పీ ఎలా ఉన్నారు.. పీఎం కార్యాలయం ఆరా

ప్రముఖ సంగీత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తాజాగా ప్రధాని కార్యాలయ అధికారులు బాలు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. బాలు చికిత్సకు సంబంధించిన వివరాల గురించి ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. అలాగే ప్రభుత్వం తరపున బాలు ఆరోగ్యం గురించి తమిళనాడు సీఎం పళనిస్వామి వైద్యులను అడిగితెలుసుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎస్పీ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించవలసిందిగా వైద్యులకు సూచించారు. కాగా, ఎస్పీ కుమారుడు చరణ్.. తండ్రి ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని చికిత్సకు స్పందిస్తున్నారని, శ్వాస సులభంగా తీసుకుంటున్నారని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story