400కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

400కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

ఇటీవల కాలంలో అక్రమ రవాణ ఎక్కువుగా జరుగుతుంది. తాజాగా ఒడిశాలోని గంజాయి స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. గజపతి జిల్లాలో అక్రమంగా 400 కేజీల గంజాయిని తరలిస్తూ ఇద్దరు పట్టుబడ్డారు. మోహనా ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు. ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా అందులో రూ. 30 లక్షల విలువైప గంజాయి ఉంది. దీంతో, గంజాయిని స్వాదీనం చేసుకోని.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని ఉదయగిరి ప్రాంతం నుంచి యూపీలో ని వారణాసికి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గత నెల కూడా ఇదే జిల్లాలో వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. సులువుగా డబ్బు సంపాదనకు యువకులు ఎక్కువగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇక్కడి కొందరు యువకులు సులువుగా డబ్బు సంపాదించేందుకు గంజాయిని పలు ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags

Next Story