హనుమాన్ చాలీసా లక్ష గళార్చన

మహమ్మారిని తరిమికొట్టడానికి మారుతి సహకారం తోడైతే.. వ్యాక్సిన్ వచ్చే లోపు దేశవ్యాప్తంగా వేల మంది, ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి ప్రాణాలను కాపాడవచ్చనే సదుద్దేశంతో హనుమాన్ చాలీసా లక్ష గణార్చన నిర్వహించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు సాయిదత్తపీఠం, నాట్స్ తో పాటు అనేక తెలుగు సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు లక్ష గళార్చన కార్యక్రమంలో పాల్గొన్నాయి.
ఒకేసారి లక్షమంది హనుమాన్ చాలీసా పఠించడంతో లక్షగళార్చన కార్యక్రమం గిన్నీస్ రికార్డును సొంతం చేసుకుంది. 50 దేశాల నుంచి హిందు భక్త సమాజం ఈ పారాయణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన సిలికానాంద్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిబొట్ల, ఆరెంజ్ మూన్ అధినేత అశోక్ బడ్డి, ఆరెంజ్ మూన్ సాంకేతిక బృంద సమన్వయకర్త హరి దేవబత్తుని అకుంఠిత కార్యదీక్షతో లక్షగళార్చన లక్ష్యాన్ని సాధించారు. సంకల్పం గొప్పదైతే సాధించలేనిది ఏదీ లేదనేది ఈ లక్ష గళార్చన నిరూపించిందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com