సోమాలియాలో ఉగ్రదాడి.. 10 మంది మృతి

సోమాలియాలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. సోమాలియా రాజధాని మొగదిషులోని ఓ హోటల్‌పై దాడులకు దిగారు. ఈ దాడిలో 10 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. తొలుత హోటల్ ముందు కారుబాంబు పేల్చి.. లోపలకి ప్రేవేశించారు. తరువాత హోటల్ లో ఉన్న పౌరులను బందీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భద్రతాబలగాలు హోటల్ చట్టుముట్టాయి. సుమారు పది మందిని కాపాడగా.. ఇంకా చాలా మంది పౌరులు లోపలే చిక్కుకున్నారు. ఉగ్రవాదులు బందించిన వారిలో యువకులు, మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. హోటల్‌పై అల్‌ఖైదా అనుబంధ అల్‌-షబాబ్‌ సంస్థకు చెందినవారు దాడికి పాల్పడ్డారని తెలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story