కాసేపట్లో 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన

కాసేపట్లో 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన
X
పుష్ప సినిమాకు అల్లు అర్జున్‌కు ఉత్తమ హీరో అవార్డు వచ్చే చాన్స్‌

కాసేపట్లో 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ట్రిపుల్‌ ఆర్‌, పుష్ప చిత్రాలు.. తమిళం నుంచి జైభీమ్‌.. మళయాళం నుంచి నాయట్టు, మిన్నాల్‌మురళి సినిమాలు పోటీలో ఉన్నాయి. ఉత్తమ నటుడు కేటగిరిలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌, సూర్య, జోజు జార్జ్‌ పోటీలో ఉన్నారు. ఉత్తమ నటి రేసులో కంగాన రనౌత్‌, అలియా భట్‌ మధ్య ప్రధాన పోటీ ఉంది.


69 ఏళ్ల తర్వాత తెలుగు వాడి కల నెరవేరే అవకాశం ఉంది.. ఇప్పటి వరకు జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏ ఒక్కరికీ ఉత్తమ నటుడు అవార్డు దక్కలేదు. ఈసారి అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ట్రిపుల్‌ ఆర్‌ స్టార్స్‌ ఎన్టీఆర్‌, చరణ్‌, పుష్ప హీరో అల్లు అర్జున్‌లో ఒక్కరికి అవార్డు వచ్చే అవకాశం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో ఉప్పెనకు అవార్డు వచ్చే అవకాశం ఉంది.. ఉత్తమ సంగీత దర్శకుడిగా పుష్ప సినిమాకు మ్యూజిక్‌ ఇచ్చిన దేవీశ్రీ ప్రసాద్‌కు నేషనల్‌ అవార్డ్‌ వచ్చే చాన్స్‌ ఉంది. కొండపొలం సినిమా పాటకు చంద్రబోస్‌కు జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story