తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలపై ఫోకస్ చేశారు. గవర్నర్ నరసింహన్ తో జగన్, కేసీఆర్ భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు, సంస్థల విభజన తదితర అంశాలపై పరిష్కారం కోసం చర్చించినట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ లో ఇఫ్తార్ విందుకు హజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన జగన్ బేగంపేట నుంచి నేరుగా రాజ్ భవన్ చేరుకున్నారు. ఆ వెంటనే సీఎం కేసీఆర్ కూడా రాజ్ భవన్ చేరుకున్నారు. ఇఫ్తార్ కు రెండు గంటల ముందే గవర్నర్ దగ్గరికి వెళ్లిన ముఖ్యమంత్రులు ఇద్దరు విభజన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందులో జగన్, కేసీఆర్ పాల్గొంటారు.