వరంగల్, హన్మకొండ, కాజీపేటలో దొంగలు హల్‌చల్ చేశారు. అర్ధరాత్రి పలు కాలనీల్లో సంచరిస్తూ దోపిడీకి ప్రయత్నించారు. దొంగల ముఠా కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాలనీల్లో దొంగల సంచారం వార్త తెలియడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడొచ్చి ఏం పట్టుకుపోతారోనని భయపడుతున్నారు. దొంగల కదలికపై దృష్టిసారించిన పోలీసులు.. ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్‌గా అనుమానిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించిన పోలీసులు.. అనుమానితులను గుర్తిస్తే.. వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.