కొంత మంది సెలబ్రిటీలతో పాటు రేణూ దేశాయ్ పేరు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వినిపించింది. ఇప్పటికే నిర్వాహకులు ఆమెని సంప్రదించారని, అందుకు ఆమె కూడా ఒప్పుకున్నారని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఒక ఆంగ్ల మీడియా ద్వారా రేణూ ఈ వార్తలపై స్పందించారు. తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించమంటే మాత్రం చేస్తానని చెప్పారు. అలాంటి అవకాశం వస్తే వదులుకోనని అన్నారు. ప్రస్తుతం తాను ఓ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌తో బిజిగా ఉన్నానని, మళ్లీ నటించేందుకు సిద్ధమవుతున్నానని అన్నారు.