బస్సు లోయలో పడి 25 మంది మృతి

Update: 2019-07-01 05:47 GMT

మినీ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణీకుల్లో 25 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 45 మంది ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు.. కిష్ట్‌వార్ జిల్లాలో సోమవారం ఉదయం 7.30 సమయంలో బస్సు స్కిడ్ అయి సిర్గ్‌వార్ లోయలో పడిపోయినట్టు ప్రముఖ వార్తా సంస్థ తెలియజేసింది. తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. 20 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు.

Similar News