శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు తనువు చాలించింది. హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన రోహిత్‌గౌడ్ సోదరి దివ్యకు 10 నెలల క్రితం వనస్థలిపురంలోని యువకుడితో వివాహం జరిగింది. ఆషాడం కావడంతో సోదరి దివ్యను తీసుకుని పుట్టింటికి బయలుదేరాడు రోహిత్. శంషాబాద్ హుడా కాలనీ వద్దకు రాగానే కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో దివ్య స్పాట్‌లోనే చనిపోగా, సోదరుడు రాహుల్‌తోపాటు తల్లికి తీవ్రగాయాలయ్యాయి. పెళ్లై ఏడాది తిరగకుండానే నవ వధువు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.