ఏవండీ.. మీకేం పట్టదా: అనసూయ

Update: 2019-07-02 10:02 GMT

వయసు పెరుగుతున్నా.. తరగని అనసూయ అందం అసూయ పుట్టిస్తుంది. అందం, అభినయం అన్నీ కలగలిపిన అనసూయ హీరోయిన్లతో పోటీ పడి నటిస్తూ మంచి మార్కులు కొట్టేస్తోంది. యాంకర్‌గా రాణిస్తూనే సినిమాల్లో తనను వరించిన పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తుంది. దీంతో మరిన్ని మంచి పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. మన చుట్టూ ఎన్నో విషయాలు.. మరెన్నో ఇబ్బందులు.. మనకెందుకులే.. మనదాకా వస్తే చూసుకుందాంలే అని అనుకునే వారే ఎక్కువమంది. కనీసం స్పందించే హృదయమన్నా ఉండాలి బాధ్యత గల పౌరులుగా.. అదే చేసింది అనసూయ.. ఇటీవలి కాలంలో నగరం నడి బొడ్డున హత్యలు.. వందల మంది చూస్తుండగానే దర్జాగా దారుణాలకు ఒడిగట్టేస్తున్నారు. ఈ ఘోరాలను ఎవరూ ఆపలేకపోతున్నారు.. ఆపే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు.

ఈ నేరాలు, ఘోరాలు జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ పని తీరుపై ప్రశ్నిస్తాం. అన్నింటికీ ప్రభుత్వాన్ని, అధికారులను దుమ్మెత్తిపోస్తుంటాం. మన వంతుగా మనమేం చేయాలి అని ఆలోచించం.. చెన్నై వాసులు ఎదుర్కుంటున్న నీటి ఇబ్బందులు మనకీ రాకుండా వుండాలంటే నీరు పొదుపుగా వాడాలి. అమ్మాయిలకు సేప్టీ లేదంటూ పోలీసుల్ని తప్పు పడతాం.. మన చుట్టు పక్కల ఏదైనా తప్పు జరిగితే మనం ఆపే ప్రయత్నం చేయకుండా.. ఎక్కడో స్టేషన్లో కూర్చున్న పోలీసులను, ఆఫీసులో ఉన్న అధికారులను, రూలింగులో ఉన్న ప్రభుత్వాలను అనడం ఎంత వరకూ కరెక్ట్ అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నలు సంధిస్తోంది అనసూయ. అయితే.. పౌరుల రక్షణ, వారి అవసరాలను చూసుకోవడం ప్రభుత్వ కర్తవ్యం కాదా అని నెటిజన్లు అనసూయపై విరుచుకుపడుతున్నారు. వాళ్లు చేయగలిగింది చేస్తారు.. ఈలోపు మన బాధ్యతగా ఎంతో కొంత చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది అని అనసూయ ట్విట్టర్‌లో పేర్కొంది. అనసూయ చేసిన ట్వీట్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

Similar News