నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని బార్‌గా మార్చేశారు అక్కడ పని చేస్తున్న కొందరు ఉద్యోగులు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో కలిసి మద్యం సేవిస్తూ మస్తుగా ఎంజాయ్ చేశారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో.. తాగుబోతు ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తులతో కలసి పలాయనం చిత్తగించారు. అయితే.. మున్సిపల్ ఆఫీసులో ఎందుకు మద్యం సేవిస్తున్నారు...? తప్పుకదా అని ఉద్యోగులను మీడియా ప్రశ్నించింది. అందుకు అక్కడ ఉన్న జూనియర్ అసిస్టెంట్ దిమ్మ తిరిగిపోయే సమాధానమిచ్చాడు. మేము డ్యూటీ చేసి బాగా అలసిపోయాం.. రిలాక్స్ కావడం కోసం మందు తాగుతున్నాం.. తప్పేంటని ఎదురు ప్రశ్రించాడు. అంతే కాదు.. ఏం చేస్తారో చేసుకొండంటూ సవాల్ విసిరాడు.