అండర్ వాటర్‌లో సమీర అందాలు..

Update: 2019-07-05 06:16 GMT

కొన్ని జ్ఞాపకాలు హృదయ మనోఫలకంనుంచి చెరిగిపోతుంటాయి. వాటిని అలాగే ఉంచాలంటే ఆ స్వీట్ మెమరీస్‌ని ఫొటోల్లో బంధించి అప్పుడప్పుడు చూసుకుని మురిసి పోవచ్చు. తాను రెండోసారి గర్భందాల్చిన తీపి గురుతులను అత్యంత వినూత్నంగా, అంతకు మించి సాహసోపేతంగా కెమేరాలో బంధించింది సమీరా రెడ్డి. వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను పెళ్లి చేసుకున్న సమీరాకు ముందు ఓ బాబు. వాడికి ఇప్పుడు నాలుగేళ్లు. రెండోసారి గర్భందాల్చి 9నెలలు నిండినప్పటికీ ఆమె ఎంతో ధైర్యం చేసి ఫోటోషూట్‌లో పాల్గొన్నది. ఈ ఫోటోలను అభిమానులకోసం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. తొమ్మిది నెలలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని.. అందుకోసమే ఇలా ఫోటోలను దిగానని చెబుతోంది సమీరా. మన భయాలు, ఎగ్జయిట్‌మెంట్‌లు అన్నీ జ్ఞాపకాలుగా మిగులుతాయి. వాటిని మనం పదిలంగా దాచుకోవాలి అంటూ సమీరా క్యాప్షన్ పెట్టింది.

Similar News