ప్రభుత్వం తనకు భూమి ఇవ్వలేదని పాఠశాలకు తాళాలు వేసి మహిళ నిరసన

Update: 2019-07-12 01:22 GMT

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం మంగల్‌ పాడ్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాలకు ఓ మహిళ తాళాలు వేసి నిరసన తెలిపింది. చిన్నూభాయి అనే మహిళ పదేళ్ల క్రితం,,పాఠశాల భవన నిర్మాణం కోసం ఎకరం భూమిని విరాళంగా ఇచ్చింది. దీనికి బదులుగా మరో చోట భూమి ఇస్తామని అధికారులు అప్పట్లో చిన్నూభాయికి హామీ ఇచ్చారు. సర్వే నెంబర్‌ 271, 273 భూమి కేటాయించారు..కానీ భూమిని చూపలేదు..రిజిస్ట్రేషన్ కూడా చేయలేదని బాధితురాలు వాపోయింది. దీంతో తనకు ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు వంటి పథకం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. భూమి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టు ఎన్ని సార్లు తిరిగినా..ఎవరూ పట్టించుకోవడం లేదని చిన్నూభాయి తెలిపింది. ప్రభుత్వ పాఠశాల కోసం భూమి ఇస్తే తనకు మొండిచేయి చూపారని మహిళ ఆవాపోయింది. అందుకు నిరసనగా పాఠశాలలోని అన్ని తరగతి గదులకు తాళం వేసి నిరసన తెలిపింది. అయితే మహిళ తాళాలు వేయడం విద్యార్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Similar News