విద్యార్ధులపై ప్రిన్సిపాల్ తన ప్రతాపాన్ని చూపించాడు.. విక్షణారహితంగా పిల్లలను చితకబాదాడు. ఈఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తిలోని మోడల్ స్కూల్‌లో చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ సెకండియర్ సీఈసీ చదువుతున్న నలుగురు కాలేజీ విద్యార్ధులను ప్రిన్సిపాల్ ఇష్టాను సారంగా కొట్టడు. దీంతో శ్రావ్య అనే విద్యార్థిని చేతికి తీవ్రంగా గాయమైంది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.