దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీకొడుతుందా?

Update: 2019-07-24 10:05 GMT

భూమి వైపు ఓ గ్రహశకలం దూసుకొస్తోంది. అది ఇవాళే భూమిని సమీపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే, అది భూమిని ఢీకొడుతుందా? లేదా దాటి వెళ్లిపోతుందా అనేది మాత్రం ఇంకా స్పష్టం కావడం లేదు. అంతరిక్షంలో ఉన్న ‘2019 OD’, ‘2015 HM 10’, ‘2019 OE’ అనే మూడు గ్రహ శకలాలు ప్రస్తుతం భూమి వైపు ప్రయాణిస్తున్నాయి. వీటిలో 2019 OD భూమికి అతి దగ్గరగా ప్రయాణిస్తోంది. ఇవాళ అది చంద్రుని కక్ష్యను సైతం దాటి భూమి వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం భూమికి 2 లక్షల19 వేల 375 మైళ్ల దూరంలో ఉన్న ఈ గ్రహ శకలం భూమి పైకి అత్యంత వేగంగా పయనిస్తోంది.

90 మీటర్ల విస్తీర్ణం కలిగిన 2019 OD గ్రహశకలం భూమి వైపు వస్తోందని మూడు వారాల కిందటే అంచనా వేశారు. భారత కాలమానం ప్రకారం.. అది రాత్రి 7.01 గంటలకు భూమిని సమీపించనుంది. ఆ తర్వాత అది ఎప్పుడైనా భూమిని ఢీకొట్టవచ్చు. ఎందుకంటే.. భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి వల్ల గ్రహశకలాలు ఇటుగా ప్రయాణిస్తాయి. భూ కక్ష్యలోకి రాగానే నిప్పులు చెరుగుతూ మండిపోతాయి. ఇలా గాలిలో మండిపోయేవే ఎక్కువగా ఉంటాయి. భూమిపై నీటి శాతం ఎక్కువ కాబట్టి.. అవి సముద్రంలో కూలేందుకే అవకాశం ఎక్కువ. అయితే, దిశ మార్చుకుని భూమి వైపుకు వస్తే మాత్రం ఫలితం భయానకంగా ఉంటుంది.

Similar News