నిజామాబాద్ జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేగింది. డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో చొరబడిన ఎలుగుబంటి.. ఐదుగురిపై దాడి చేసింది. భయంతో గ్రామస్తులు రోడ్డుపైకి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అటు.. ఎలుగుబంటిని బట్టుకునేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.