తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత సి. కల్యాణ్ ‘మన ప్యానెల్’ విజయం సాధించింది. ప్రొడ్యూసర్ సెక్టార్‌కి సంబంధించి ప్యానెల్‌కు జరిగిన ఈ ఎన్నికల్లో నిర్మాతలు దిల్‌రాజు, సి.కల్యాణ్ ప్యానెల్లు పోటీ పడ్డాయి. ఈ ఎన్నికల్లో 12 మంది ఈసీ సభ్యుల్లో సి. కల్యాణ్ ‘మన ప్యానెల్’కు చెందిన వారు 9 మంది, దిల్‌రాజు యాక్టివ్ ప్యానెల్ కు చెందిన ఇద్దరు విజయం సాధించారు. 20 మంది సెక్టార్ సభ్యుల్లో 16 మంది సి. కల్యాణ్ ప్యానెల్ నుంచి గెలుపొందారు. నలుగురు దిల్‌రాజు ప్యానెల్ నుంచి విజయం సాధించారు. ఇక ఈసీ సభ్యులుగా దిల్‌రాజు, దామోదర్ ప్రసాద్ ఎన్నికయ్యారు.