మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో భేటీ అయ్యారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి. స్వయంగా వివేక్ నివాసానికి వెళ్లి మంతనాలు జరిపారు. కొన్ని రోజులుగా వివేక్ బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కూడా వివేక్ కలిశారు. ఈ నేపథ్యంలో వివేక్ వెంకటస్వామితో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.