ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం వల్ల 3 లక్షల 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే, పోలవరం వద్ద 24 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. కఫర్‌డ్యామ్ ఎగువ గ్రామాలకు ముంపు భయం వెంటాడుతోంది. బ్యాక్ వాటర్‌తో 16 గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ధవళేశ్వరం దిగువన కోనసీమ లంక గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి.