కర్ణాటక విధానసభ నూతన స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ స్థానానికి ఆయన నామినేషన్ ఒక్కటే దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. విశ్వాస పరీక్షలో యడియూరప్ప ప్రభుత్వం విజయం సాధించడంతో కేఆర్ రమేష్ కుమార్ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో విశ్వేశ్వర్‌ను నూతన సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పీకర్ ఎన్నికను డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి నిర్వహించారు. కృష్ణారెడ్డి కూడా రెండు రోజులపాటు స్పీకర్ గా వ్యవహరించారు.