'రెరా' రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇళ్లు.. ప్లాట్లు కొనాలంటూ..

Update: 2019-08-01 10:09 GMT

రెరా చట్టం కింద నమోదు కాని ప్రాజెక్టులలో ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేయవద్దని తెలంగాణ రెరా అధికారులు ప్రజలను కోరుతున్నారు. జనవరి1, 2017 నుంచి ఆగస్ట్ 31, 2018 మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేపట్టిన ప్రాజెక్టులకు 2019 జులై 31వ తేదీ వరకు రెరా రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. కొంత మంది వ్యాపారులు మాత్రమే ఈ అవకాశానికి ఉపయోగించుకున్నారు. చాలా మంది మాత్రం రెరా రిజిస్ట్రేషన్ పట్ల ఆసక్తి చూపించలేదు. దీంతో తమ రిజిస్ట్రేషన్ లేని వెంచర్లలో ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేయవద్దని రెవెన్యూ అధికారులు ప్రజల్ని కోరారు. రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు వివరించారు.

Similar News