టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. అన్నా ఆపదలో ఉన్నా అంటే చాలు.. వారు అడిగిన సహాయం చేస్తూ చేయూతనిస్తున్నారు. తాజాగా మరో దివ్యాంగుడికి ఆసరాగా నిలిచారు. అతను చేసిన ట్వీట్‌కు స్పందించి కేటీఆర్ ఉద్యోగంతో పాటు ఇల్లూ ఇస్తామని హామీ ఇచ్చారు.
దివ్యాంగుడైన సందీప్ కుమార్ రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి వాసి. దివ్యాంగుడు అయినప్పటికీ కంప్యూటర్ నైపుణ్యాలు నేర్చుకుని కంప్యూటర్ ఆపరేట్ చెస్తున్నాడు. శారీక వైకల్యం ఉన్నప్పటికీ అతని ఆశయానికి అవేవి అడ్డుకాలేదు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను నిర్వహించాడు. తన సోషల్ మీడియా నైపుణ్యంతో సందీప్ కుమార్.. కేటీఆర్‌కు ఉపాధి అవకాశం కావాలంటూ ట్వీట్ చేశాడు. అతని ట్విట్‌కు స్పందించిన కేటీఆర్ అదుకుంటామని అభయం ఇచ్చారు
Also Watch